నటరాణి రంగస్థల కళాకారుని అరుణకుమారికి అభినందనలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కర్నూలు నగరం నందలి సూరన్న తెలుగు తోట నందు అభినందన కార్యక్రమం రాయలసీమ రంగస్థల నాట్య మయూరి అరుణకుమారికి నటరాణి అవార్డుతో తిరుపతి దేవస్థానం శ్రీ వంశీ కళాపరిషత్ వారిచే అరుణ కుమారికి నటరాణి అవార్డు బహుకరణ ఘనంగా సత్కరించి సన్మానం చేయడం అభినందనీయమని కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి బైలుప్పల షఫీయుల్లా క్కెకు కట్ చేసి మిఠాయిలు పంచి అభినందనలు తెలియజేశారు. నటరాణి అరుణకుమారి అభినందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి వెంకయ్య ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి ఎం రాజారత్నం అభినందిస్తూ రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో జరిగిన నాటకాలలో అరుణకుమారి మంచి గుర్తింపు ఉందని తెలిపారు. దాసరి నామాల వెంకటసుబ్బయ్య డి పుల్లయ్య వెంకటేశ్వర్లు డాక్టర్ కదిరి రమేష్ శిక్షావలి పివి రమణచారి హార్మోనియం విద్వాంసులు బండారు బలరాం వెంకటేశ్వర్లు నాగరాజు తదితరులు రంగస్థల కళాకారులు అరుణకుమారి అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిన నటరాణి అవార్డును మహిళా కళాకారులకు అంకితం ఇస్తున్నట్టు నటరాణి అరుణకుమారిఅన్నారు. రంగస్థల కళాకారులకు అభిమానులకు అభినందనలు తెలియజేశారు. రాయలసీమ కళాకారుల ఐక్యతతో సీమస్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి బహుమతులు రంగస్థల కళాకారులు పొందాలని మనసారా కోరుకుంటానని నటరాణి అరుణకుమారి తెలిపారు.