NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ పై ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్ర‌శంస‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయానని అన్నారు. కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉందని, పక్కా ఎజెండాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. “ కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వెళ్లి కలుస్తా. నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యాను. బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ లీడ్ చేయగలరు. దేశరాజకీయాలపై కేసీఆర్ నాకంటే ఎక్కువ స్టడీ చేశారు. కేసీఆర్ మంచి కమ్యూనికేటర్. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కన్నా కేసీఆర్ బాగా కమ్యూనికేట్ చేయగలరు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అనిపిస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయం అవసరం’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

                                           

About Author