పీవీ సింధుకు పార్లమెంట్ లో అభినందన
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును పార్లమెంట్ అభినందించింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పి.వి. సింధు విజయాన్ని ప్రస్తావించారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం సాధించడం పట్ల ఉభయ సభలు ఆమెను అభినందించాయి. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు ఆమె కావడం విశేషమని, సభ్యులందరి తరపున ఆమెకు అభినందనలు అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. యువతకు ఆమె స్పూర్తిదాయకమని ఓం బిర్లా కొనియాడారు.