రామయ్యకు అభినందన
1 min read
ఎమ్మెల్యే సమక్షంలో బీవై రామయ్యకు అభినందనలు తెలిపిన కేదర్నాథ్
వైఎస్సార్ 24 ఫౌండేషన్ రాయలసీమ సమన్వయకర్త కేదార్నాథ్
పల్లెవెలుగు, కర్నూలు: కర్నూలు పురపాలక సంస్థ ఎన్నికలోభారీ మెజార్టీతో గెలిచిన 19వ వార్డు మేయర్ అభ్యర్థి రామయ్యకు భారీ మెజార్టీతో గెలుపొందడం అభినందనీయమని వైఎస్సార్ 24 ఫౌండేషన్ రాయలసీమ సమన్వయకర్త కేదార్నాథ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో కాబోయే మేయర్ బీవై రామయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేదర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన సుపరిపాలనను ప్రజలు మరోసారి ఆదరించి.. పట్టాభిషేకం కట్టారన్నారు. కర్నూలు కార్పొరేట్ వైసీపీ అభ్యర్థుల విజయం అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ నేతృత్వంలో కర్నూలు అనేక అభివద్ధి పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా కాబోయే మేయర్ బీ వై రామయ్య… కర్నూలు ప్రజలకు సుపరిపాలన అందిస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు.