కమనీయం శ్రీ విజయ దుర్గ దేవి రథోత్సవం…
1 min read
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
మంత్రాలయం న్యూస్ నేడే: మండల పరిధిలోని రచ్చమర్రి మాధవరం గ్రామాల మద్య వెలసిన శ్రీ విజయ దుర్గ దేవి (మారెమ్మ అవ్వ)4 వ రథోత్సవం గ్రామ ప్రజల అధ్వర్యంలో సోమవారం కమనీయం గా సాగింది. ఈ సందర్భంగా ఉదయం విజయ దుర్గ దేవి కి గంగ పూజ, పంచామృతభిషకం, అభిషేకం, ఆకు పూజ, మంగళహారతి, మహనైవేద్యం పూజ వంటి వివిధ రకాల పూజలు చేశారు. సాయంత్రం దుర్గ దేవి ప్రతిమ ను రథోత్సవం పై ఆశీనులు చేసి డప్పుల బాణాసంచా కాల్చి ప్రజల హర్షధ్వనుల మద్య మహిళలు, యువతులు కలశములతో రథోత్సవం ఊరేగించారు. రథోత్సవ వేడుకల్లో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో పూలతో సుందరంగా అలంకరించారు.
అమ్మ వారి ని దర్శించుకున్న పలువురు నాయకులు : శ్రీ విజయ దుర్గ దేవి (మారెమ్మ అవ్వ) రథోత్సవం సందర్భంగా పలువురు నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు పైబావి అమర్నాథ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి వేరు వేరు సమయాల్లో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి ఆలయ పెద్దలు సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా సిఐ రామాంజులు ఆదేశాల మేరకు మాధవరం ఎస్సై విజయ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
