సాంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయింపుపై సీఎంకు అభినందనలు ..
1 min read
హనుమంతరావు చౌదరి
కర్నూలు న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశం పెట్టిన సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక రంగానికి 469 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి 40 కోట్లు,నిధులు కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు చౌదరి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో కళాకారులకు బడ్జెట్ కేటాయించడం కళాకారులందరికి సంతోషంగా ఉందన్నారు. గత ఐదు ఏళ్ల పాలనలో ఎంతో అన్యాయం జరిగిందని, చింతామణి నాటకం రద్దుచేసి కొన్ని వేల మంది కళాకారులను వీధిపాలు చేసి కళలకు నిదులు కేటాయించకుండా తెలుగు భాషను , కళలను, కళాకారులను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్హత లేని వెధవలకి, వెకిలిగా మాట్లాడే వాళ్ళకి అతనికి వత్తాసు పలికే పోచాని మురలి కృష్ణ లాంటి వాళ్లు, ఇంకా ఎంతో మంది నాయకులు ఇప్పుడు జైల్లో ఉన్నారన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని, నోరు ఉంది కదా అని ఎట్లయినా తప్పు మాట్లాడితే శిక్ష తప్ప దన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో కళాకారులకు, కళలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కళలకు కళాకారులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారన్నారు. ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆప్యాయతగా కళాకారులను అక్కున చేర్చు కుంటారని అటువంటి తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్క కళాకారులు గౌరవించాలని అన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కళల ప్రచారం ద్వార ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు తెలియజేస్తామని హనుమంతరావు చౌదరి, ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మీ పద్మా చౌదరి తెలియజేశారు.