జిల్లా కలెక్టర్ కు అభినందనల వెల్లువ..
1 min readజిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు..
సందర్బంగా వె. ప్రసన్న వెంకటేష్ ను సత్కరించిన జిల్లా అధికారులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు పలువురు న్యాయ, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలు పూర్తిచేసుకొని మూడవ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్బంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తమకుమార్, డిఐజి జి.వి.జి అశోక్ కుమార్, పూలమాల శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసారు. ఒక జిల్లాని ప్రగతి పధంలో తీసుకువెళ్లడం సామన్యమైన విషయంకాదని జిల్లా కలెక్టర్ గా అన్ని విభాగాల్లోను అధికారులను సమన్వయపరిచి మార్గదర్శకత్వాన్ని అందిస్తూ తగిన సలహాలు, సూచనలతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వె. ప్రసన్న వెంకటేష్ కృషిచేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. అదే విధంగా గోదావరి వరద ముంచేత్తిన ప్రకృతి మిఛాంగ్ తుఫాన్ రూపంలో విశ్వరూపం ధరించినా మొక్కవోని ధైర్యంతో సహాయ పునరావాస చర్యలను నిర్వహించి ముఖ్యమంత్రి ప్రశంసలను కూడా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చూరగొన్నారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతంతో వృత్తే దైవంగా భావిస్తున్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తమకుమార్ మాట్లాడుతూ ఆయా రంగాల్లో జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషి అభినందనీయమని ఇదే స్పూర్తితో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏలూరు రేంజ్ డిఐజి జివిజి అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవలో అంకిత భావంతో ప్రగతి దిశగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిరంతర కృషి ఎంతో స్పూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మొదటి అధనపు జిల్లా జడ్జి జి. రామ్ గోపాల్ తో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, ఐటిడిఎ పివో యం సూర్యతేజ, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంధ్రన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, డిఎఫ్ఓ రవీంధ్రదామ, సెబ్ జాయింట్ డైరెక్టర్ ఎన్ సూర్యచంద్రరావు, డిఆర్ఓ యం. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ లు ఎన్ఎస్ కె ఖాజావలి, ఎ. అద్దయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి సత్యనారాయణ, కె. బాబ్జి, బానుశ్రీ, హౌసింగ్ పిడి కె. రవికుమార్, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు,తహశీల్దార్ బి. సోమశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.