ఓడిన వారికి పదవులు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : వైసీపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహుర్తం ఖరారైంది. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే జాబితా కూడ సిద్దమైనట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కేవలం 24 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఓటమి పాలైంది. ఓటమి పాలైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ 24 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. 175 నియోజకవర్గాల్లో వైకాపా వారు ప్రొటోకాల్ పదవిలో ఉండేటట్టు చూస్తున్నారు. త్వరలో 80 కార్పొరేషన్లకు డైరెక్టర్లు, చైర్మన్లను నియమించనున్నారు. ఈ పదవుల్లో 24 మంది ఓడిపోయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు.. గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన వారికి కూడ స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. దీంతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ప్రొటోకాల్ పదవిలో ఉంటారు.