ప్రాణదాతలకు… అభినందన
1 min readపల్లెవెలుగు, కర్నూలు
అత్యవసర సమయంలో..రక్తదానం చేసే ప్రాణదాతలు.. దేవుళ్లతో సమానమని టైగర్ టీం ఎన్టీఆర్ మరియు ఎన్కేఆర్ అభిమాన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు అభిప్రాయపడ్డారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నిత్యం రక్తం అవసరమవుతుందని, ఈ విషయంలో సహాయం చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ వారు తమను సంప్రదించడంతో… ఎన్టీఆర్ మరియు ఎన్కేఆర్ అభిమానులతో రక్తదాన శిబిరంలో రక్తదానం చేయించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ అధికారి, సెట్కూరు సీఈఓ నాగరాజు చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి ధ్రవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోడానికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. రక్తదానం చేసిన వారిలో టైగర్ టీం, ఎన్టీఆర్ మరియు ఎన్కేఆర్ అభిమానులు ఈరన్న, దుర్గన్న, జమ్మయ్య, సి. దుర్గన్న, చిన్న దుర్గన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.