NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ హ్యాకింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫోన్ హ్యాకింగ్ వ్యవ‌హారంలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ‘ పెగాస‌స్ ’ ల‌క్ష్యంగా చేసుకున్న వారిలో కీల‌క‌మైన వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ‘ పెగాస‌స్’ టార్గెట్ జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్, మాజీ సీఈసీ అశోక్ లావాసా ఫోన్ నంబ‌ర్లు హ్యాకింగ్ టార్గెట్ జాబితాలో ఉన్నట్టు ‘ది వైర్’ తాజా క‌థ‌నంలో పేర్కొంది. పెగాస‌స్ ల‌క్ష్యంగా చేసుకున్న జాబితాలో 300 మంది భార‌తీయులు ఉన్నట్టు ది వైర్ వార్త సంస్థ నిన్న ప్రక‌టించింది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ నంబ‌ర్ కూడ క‌నీసం ఒక‌సారి హ్యాక్ అయి ఉంటుంద‌ని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ, మాజీ సీఈసీ అశోక్ లావాసా పేర్లు జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.

About Author