PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ నేత వి. హ‌న్మంత‌రావు కారు పై దాడి !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి ముందు నిలిపిన కారుపై దుండగులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనపై వీహెచ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్య పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్య ఎవరు చేశారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని తెలిపారు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన తనకు కనీస రక్షణ బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో డీజీపీకి విన్నవించినా కూడా పరిష్కారం చూపలేదని, ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదని వీహెచ్ పేర్కొన్నారు.

                                     

About Author