కర్నూలు ..కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్. మాలిక్ బాషా దరఖాస్తు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని మైనారిటీ స్థానిక నియోజకవర్గ నాయకుడు శ్రీ. షేక్. మాలిక్ బాషా కోరారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. కర్నూలు నియోజకవర్గం పరిధిలో తమ మైనారిటీ సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మీద, Y S రాజశేఖరరెడ్డి గారి మీద ప్రజలలో అపారమైన ప్రేమ అభిమానం ఉంది అని, అది గాక షేక్. మాలిక్ బాషా స్థానికంగా ప్రతి సామజిక వర్గాల్లో మంచి గుర్తింపు, అభిమానం సంపాదించుకున్నారు ,కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన, విచారణ చేసి తనకు సీటు కేటాయించాలని కోరారు.