NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 21న కాంగ్రెస్ బహిరంగ సభ

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు యం సుధాకర్ బాబు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అక్టోబర్ 21వ తారీకు తేదీ ఈ నెల అక్టోబర్ 21వ తేదీ మంత్రాలయం నియోజకవర్గం నందు భారీ బహిరంగ సభ జరుగునని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఏం సుధాకర్ బాబు  పత్రికా ప్రకటనలో తెలియజేశారు. సుధాకర్ బాబు  అఖిల భారత కాంగ్రెస్ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించి సంవత్సరం అయిన సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఈనెల 21వ తేదీన భారీ బహిరంగ సభక ఏర్పాటు చేయడమైనదని ఈ బహిరంగ సభకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖర్గే ,ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు , జాతీయ మరియు రాష్ట్రస్థాయి నాయకులు హాజరవు తున్నందున ఆదివారం మంత్రాలయం నియోజకవర్గం నందు మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కే బాబురావుతో కలిసి హెలిపాడ్ ప్రాంతాన్ని మరియు సభ జరుగు ప్రదేశాన్ని పరిశీలించడం జరిగిందని సుధాకర్ బాబు  తెలియజేశారు. పరిశీలించిన వారిలో మంత్రాలయం కాంగ్రెస్ ఇంచార్జి కే బాబురావు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్ సి బజారన్న ఆదోని కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ బీ నీలకంఠప్ప  ఓబీసీ విభాగం జిల్లా చైర్మన్ ఎం కాసిం వలీ, ఓబిసి  కార్యదర్శి కోసిగి జిలాని, డిసిసి కార్యదర్శి పెద్దకడబూరు నరసింహులు యూత్ కాంగ్రెస్ నాయకులు మారుతీ రావు మొదలుగు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About Author