రాజా రెడ్డి నగర్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
1 min readపత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని రాజారెడ్డి నగర్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి క్రాంతి నాయుడు భరోసా ఇచ్చారు. గురువారం పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా డిసిసి అధ్యక్షులు బాబు రావు ,మాజీ మంత్రి మారెప్ప పాల్గొని ఈ నెల 29న కర్నూలు కు విచ్చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షులు వైయస్ షర్మిల రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి అని కోరారు. అనంతరం స్థానిక వైఎస్ రాజా రెడ్డి నగర్ ను సందర్శించి ఆరోజు కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా మంజూరు అయిన కాలనీ ను కొందరు నాయకులు 3 కోట్ల వరకు స్కాం చేసి దోచుకున్నారు, వారు ఇప్పుడు వైసీపీ లో ఉండి ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ అండదండలతో స్కాం చేయడం జరిగింది, కావున బాధితులకు న్యాయం చేయాలి అని పేదలకు అన్యాయం చేసిన ద్రోహులను శిక్ష పడే వరకు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని ఎందాకైనా పోరాడుతామని అగ్ర నాయకులు అండ ఉంది అని తెలియజేశారు. కార్యక్రమంలో Intuc జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండ్లూరి లాజరస్, రాష్ట్ర obc ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా సెక్రెటరీ అబ్దుల్ హై, ఉపాధ్యక్షులు డాక్టర్ విక్రమ్ నాయుడు, ఏవి నాయుడు, కార్యదర్శులు హుస్సేన్, రహీమ్, నాగార్జున, షబ్బీర్, ప్రశాంత్, రహిమన్, మొహమ్మద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.