కాంగ్రెస్ పార్టీ ఓబిసిల ప్రయోజనాలను దెబ్బతీసింది
1 min read
అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
బిజెపి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే వ్యవహరిస్తుంది :
అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
విజయవాడ , న్యూస్ నేడు : గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబిసిల ప్రయోజనాలను దెబ్బతీసిందని అఖిలభారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అఖిలభారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 52 శాతం ఉన్న ఓబీసీ ప్రయోజనాలను గతపాలకులైన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా పాలన సాగించిందన్నారు. మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదన్నారు. ప్రస్తుత బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఓబీసీల కు అన్యాయం చేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో శాసనసభలలో ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓబీసీల ప్రయోజనాలకు కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి ఉద్యోగుల సంఘం మహిళ కన్వీనర్ వి శ్రీదేవి యాదవ్, విజయవాడ సెంట్రల్ కన్వీనర్ బాల నారాయణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు రాష్ట్ర నాయకురాలు అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు.