తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం
1 min readబాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న జిల్లా అధ్యక్షులు
జే లక్ష్మి నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కల్లూరు : ఈరోజు వెలువడిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అమ్మ హాస్పిటల్ సర్కిల్ నందు బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను చేసుకున్న జిల్లా అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అక్కడ జరుగుతున్న దొరల,నియంతల పాలన అంతమొందాలని,ప్రజలు స్వేచ్ఛ,సమానత్వం,అధికార వికేంద్రీకరణ కోరుకున్నారు కనుకనే కాంగ్రెస్ పార్టీ అధికారం లోనికి తీసుకొచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ 2009 లో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారు, ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణా ఇచ్చినందుకు ఆంధ్రాలో కానీ దేశములో పార్టీనీ మొత్తం కోల్పోయారు అయిన కూడా త్యాగాలు చేసే పార్టీ స్వాతంత్రము రాక మునుపు నుండి ఇప్పటి వరకు అది ఎదన్న ఉంధి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీనే, తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి,సోనియాగాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చు కావాలని.గట్టిగా కోరుకున్నారు కాబట్టే,కాంగ్రెస్ పార్టీని అఖండ విజయానికి తోడ్పాటు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి , రమణ , జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి స్వామి, జిల్లా కార్యదర్శి జనార్ధన్ యాదవ్ జిల్లా యస్సీ సెల్ అధ్యక్షుడు నాగాలింగం , జిల్లా మైనారిటీ అధ్యక్షులు పఠాన్ హాబిబ్ ఖాన్ , పాణ్యం నియోజకవర్గం కో ఆర్డినేషన్ సభ్యులు సాంబశివుడు , కల్లూరు మండల అధ్యక్షులు శేఖర్ , డోన్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ యాదవ్ , మహేంద్ర , హుస్సేన్ , మరియు మిగతా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .