కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు… అంబరాన్నంటిన సంబరాల
1 min read– పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 సీట్లకు పైగానే విజయ దుందుభి మోగించింది. ఈ సందర్భంగ నంద్యాల పార్టీ ఆఫీసులో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి నూనెపల్లె సర్కిల్ నందు శ్రీనివాస సెంటర్ మీదుగా గాంధీ చౌక్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచారాలను కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా వారితో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఈ విధంగా మాట్లాడారు… కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇచ్చే కాంగ్రెస్ పార్టీని చూసి పెద్ద ఎత్తున ఓట్లు వేసి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ముందు నరేంద్రమోడీ , అమిత్ షా లు మతతత్వంతో ఓట్లు రాబట్టాలని, అధికారం చేపట్టాలని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికె ఓటు వేశారు. ఇది మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. రానున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం* *సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ N. రఘువీరారెడ్డి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి గిడుగు రుద్దరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బెంగళూరు నగరం ఎన్నికల పరిశీలకులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం నియోజకవర్గాలలో* *కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీన్నిబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది రఘువీరారెడ్డి గారు ఎటువంటి చరిష్మా గల నేత అనేది. కావున దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది. ఈరోజు కర్ణాటక ప్రజలు ఏ విధంగా తీర్పును ఇచ్చారో రేపు 2024 లో జరగబోయే* *ఎన్నికల్లో పునరావృతం కాబోతుంది ఈ ఎన్నికల్లో గెలుపొంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నది మా ఆశయం. ఆ ఆశయాన్ని సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్ర అభివృద్ధి , ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొటు వాసు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, ఎస్సీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ కరాటే బాలకృష్ణ, సేవ దళ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, బీసీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సంపంగి రామకృష్ణ, జిల్లా కోశాధికారి ఎస్ వై డి ప్రసాద్, మైనార్టీ నాయకులు చాబోలి సలాం, ఐ ఎన్ టి సి నాయకులు ఆర్టీసీ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు పాస్టర్ పాల్ రాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్ కుమార్, కృష్ణ బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు జజ్జన రవిబాబు, మైనార్టీ సీనియర్ నాయకులు పాల మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.