చీలిక దిశగా కాంగ్రెస్ ?
1 min readపల్లెవెలుగువెబ్ : గోవాలో రాజకీయ అస్థిరత ప్రమాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పర్యవసానంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న మైఖెల్ లోబోను ఆదివారం ఆ పదవి నుంచి పార్టీ నాయకత్వం తొలగించింది. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా, అందులో కాంగ్రె్‌సకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ గోవా ఇన్‌ఛార్జి దినేష్ గుండూరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌లు బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటూ ఫిరాయింపులు జరిగేలా కుట్ర పన్నుతున్నారని అన్నారు.