భారత్ జోడో యాత్ర ఫలితమే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం
1 min read– కర్ణాటక రేపు తెలంగాణ ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం డంక మోగించబోతుంది.
పల్లెలుగు వెబ్ కర్నూలు: శనివారం నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మీనరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ చేపట్టి బాణసంచా కేరింతలు కేకలు వేసి ఆనందోత్సవ ర్యాలీ పాణ్యం నియోజకవర్గం క నంద్యాల చెక్ పోస్ట్ హాస్పటల్ సర్కిల్ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలితమే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది అని ఈ ఘనత రాహుల్ గాంధీకి చెందుతుంది.కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారిని రెండు సంవత్సరాలు పార్లమెంటుకు రాకుండా సస్పెండ్ చేస్తూ బయటకు పంపడాన్ని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి 138 సీట్లు గెలిపించి 138 మందిని మందిని అసెంబ్లీకి లోపలికి పంపడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారి యొక్క సత్తా తెలిసింది. కర్ణాటక ప్రజల గూడా బీజేపీని పూర్తిగా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకే పూర్తిగా పటం కట్టడం జరిగింది కర్ణాటక ప్రజలకు మనస్పూర్తిగా హృదయపూర్వక నమస్కారాలునరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా దాదాపు 5 నుంచి పది రోజులు రోడ్ షోలు ర్యాలీలు కార్నర్ మీటింగ్లు పెట్టిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారు . కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది అదేవిధంగా 2024 లో దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం విజయం సాధిస్తాది. బిజెపి మతతత్వాకుల తత్వ రాజకీయాలు చేసిన ఎన్ని కుట్రలు పండిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే ఉండి. కాంగ్రెస్కే ఓట్లు వేశారు. ఈ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు నంద్యాల పార్లమెంటు కాంగ్రెస్ కమిటీ మరియు ప్రజల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ఇదే తీర్పును రేపు తెలంగాణ ప్రజలు కూడా ఒరవడి కొనసాగిస్తారని మరిమరి ఆకాంక్షిస్తూ కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పటాన్, ఎసి సెల్ జిల్లా అధ్యక్షులు ఎం నాగలింగం, జిల్లా కార్యదర్శి ఉన్నిగొర్ల జనార్ధన్, జిల్లా కార్యదర్శి ఐ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు సాంబశివుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సలింద్ర లక్ష్మన్న,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.