PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అఖిల భారత కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి…

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: దేశంలో అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి, విజయాలకు దిక్సూచిగా నిలిచిన అఖిలభారత రైతు సంఘం కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15,16,17 తేదీలలో కర్నూల్ నగరంలో  జరగబోతున్నాయని,ఈ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ రైతు సంఘం మండల కార్యదర్శి సూరి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ సీనియర్ నాయకులు నాగేష్ లు కోరారు.ఈ మేరకు దేవనకొండ మండల కేంద్రంలో సోమవారం స్థానిక హమాలి వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు రైతు సంఘం అఖిల భారత కౌన్సిల్ సమావేశాల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ  ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అదేవిధంగా, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా దేశంలోని పాలకులు  పరిశ్రమలనే కాకుండా వ్యవసాయాన్ని కూడా ఆదానీ, అంబానీలకు అప్పచెప్పాలన్న దుర్మార్గమైన కుట్రల కు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహిస్తున్న ఏ కె ఎస్ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు నాందిగా కర్నూల్ నగరంలో జరగబోయే కౌన్సిల్ సమావేశాలు వేదిక కాబోతున్నాయని అన్నారు.అదేవిధంగా ఘనమైన చరిత్ర గల అఖిల భారత రైతు సంఘం 1936 సంవత్సరం ఏర్పడి న నాటి నుండి దేశ స్వాతంత్ర ఉద్యమంలో రైతులను సమీకరించడమే కాకుండా భూస్వామ్య ,పెత్తందారీ, జమీందారీ పాలనకు  వ్యతిరేకంగా పోరాడి విజయాల సాధించిందని తెలిపారు.అందులో ప్రధానమైనవి వీర తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం,కేరళ పున్నపు వ్రాయిలర్ పోరాటం, బెంగాల్ లో భూమి బుక్తి విముక్తి పోరాటం, మహారాష్ట్ర ఆదివాసి వర్లీ పోరాటం పంజాబ్లో కౌలు రైతుల అండగా పోరాటా లు  గణతకెక్కాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నేడు కనీస మద్దతు ధర రైతాంగానికి సాగునీరు,అందుబాటులో  బ్యాంక్ రుణాలు, కార్పెట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా నిత్యం పోరాటాలు చేస్తుందని అన్నారు .ఈ నేపథ్యంలో జరగబోయే కౌన్సిల్ సమావేశాలను మండల రైతాంగం జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నాగరాజు, రాయుడు, రాముడు, మహేంద్ర, మహేష్, రంగస్వామి  తదితరులు పాల్గొన్నారు.

About Author