NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

28,29 న జీపు జాతాను జయప్రదం చేయండి : సిపిఎం

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణభేరి జీపు జాతాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు గురువారం సిపిఎం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రత్యేక హోదా పోలవరం జాతీయ ప్రాజెక్టు కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు,రాజధాని నిర్మాణం,రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, కడప ఉక్కు రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదు అన్నారు. దేశంలో ముఖ్యంగా బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలలో మైనార్టీలకు భద్రత లేకుండా పోతుంది స్త్రీలను నడిరోడ్డు మీద నగ్నంగా ఊరేగించి సిగ్గు లేకుండా అదేదో తమ ఘనత అన్నట్లు విర్ర వీగుతున్న వారిని మోడీ ప్రభుత్వం సమర్థిస్తుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు.ప్రధాన పార్టీలు తమలో తాము అధికారం కోసం కుస్తీలు పడుతున్నాయి ప్రమాదంలో పడిన మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్న సామాన్య ప్రజలకు నిజమైన ఊరట లభించాలన్న ప్రజలే ఐక్యంగా కదలాలి అప్పుడే ప్రత్యేక హోదా సాధించగలం విశాఖ ఉక్కును కాపాడుకోగలం అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.పక్కీర్ సాహెబ్,టి ఓబులేష్,మండల కార్యదర్శి లింగస్వామి,దానమయ్య,ఏసన్న,ప్రభాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author