స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయండి
1 min readయుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(UTF) రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడలో ఈ నెల 5, 6, 7 8 తారీకులలో నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజ తెలిపారు.ఈసందర్భంగా ఆయన రాష్ట్ర మహాసభలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను బాలికల ఉన్నత పాఠశాలలోవిడుదలచేయడం జరిగింది. ఈ కరపత్రాలు విడుదలలో మండల విద్యాశాఖ అధికారులు గంగిరెడ్డి,సునీత, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు రమణ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఉద్యమానికి ఉపాధ్యాయులకు దిక్సూచిగా పనిచేస్తున్నసంఘము యుటిఎఫ్ అని అలాగే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వ బడుల బలోపేతానికి యుటిఎఫ్ బలంగా పనిచేస్తున్నదని ఆయన తెలిపారు.అలాగే యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా మాట్లాడుతూ, యుటిఎఫ్ ప్రభుత్వ విద్యారంగానికి ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషిని సమీక్షించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవటానికి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఈ స్వర్ణోత్సవ మహాసభలలో పలుకీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరచటానికి ప్రాథమిక పాఠశాల మూసివేతకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య పరంగా చేసే ప్రయోగాలను నిర్ణయాలను ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు ఎమ్మెల్సీ లతో చర్చించి నిర్ణయాలు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అందుకోసం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కొనసాగించాలన్నారు. అలాగే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ గా డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాసులు ,చిన్నప్ప హేమలత ,శ్యామల మేరీ, సునీత, మధుసూదన్, ఖాదర్ ,వెంకటసుబ్బయ్య వెంకట శివుడు తదితరులు పాల్గొన్నారు.