NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 24న జరిగే కురువ సింహ గర్జనను జయప్రదం చేయండి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఈనెల 24న ఆలూరులో జరిగే మదాసి మదారి కురువ సింహ గర్జననును జయప్రదం చేయాలని మాదాసి మదారి కురువ సంఘం పత్తికొండ నియోజకవర్గ బాధ్యులు సోమలింగడు బ్రహ్మయ్య కోతి రాళ్ల గ్రామ సర్పంచ్ కురువ అంజనేయ పిలుపునిచ్చారు. స్థానిక రీడింగ్ రూము ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో కురువ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు ప్రాధాన్యత నివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న కురువల జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే  సీట్లను సాధించే క్రమంలో మదాసి మదారి కురువల సింహ గర్జన ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు  సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికన ఎంపీ ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మదాసి మదారి కురువలు ఈనెల 24న ఆలూరులో చేపట్ట తలపెట్టిన ఊర్వ సింహ గర్జనకు జిల్లా వ్యాప్తంగా కురువ సామాజిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కురువ సంఘం నాయకులు కురువ బలరాముడు, రాతన ఈరమ్మ, పుచ్చకాయల మాడ మోహన్, వెంకటేశ్వర్లు, దేవేంద్ర, పందికోన శ్రీని వాసులు, హోసూరు నరసింహులు, చిన్నహుల్తి శంకరన్న, చక్రాల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. 

About Author