PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాసభలను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని మండల కేంద్రమైన గోనెగండ్ల లో స్థానిక ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహాసభల కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తాలూక అధ్యక్షుడు మునిస్వామి మాట్లాడుతూ ఈ నెల 15,16 తేదీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య {ఏఐఎస్ఎఫ్} నిర్మాణ మహాసభలను నిర్వహిస్తున్నామని ఈ మహాసభల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థివ్యతిరేక విధానాలపైనా పోరాటాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి జిల్లా నిర్మాణ మహాసభలు ఉపయోగపడతాయన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడాన్ని ఏఐఎస్ఎఫ్ గా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు జగన్ అన్న దీవెన వసతి దీవెన విద్య దీవెన అమ్మ ఒడి వివిధ రకాల పేర్లతో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకొని సంవత్సరం గడవకముందే ఆ పథకాలలో కోత విధిస్తామని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.. పూటకొక మాట మాట్లాడుతున్నటు వంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థుల పథకాలను ఎత్తివేస్తే భవిష్యత్తులో మీ ప్రభుత్వం కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 25 మండలాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇలాజ్, కాసిం వలి, జలీల్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

About Author