NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరవీరుల సంస్మరణ సభలను జయప్రదం చేయండి

1 min read

– పిడిఎస్ యూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా అది ఎన్నిక..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఈ నెల 6వ తేదీన నందికొట్కూరు మండలం బోల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న అమర వీరుల వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఇఫ్ట్ నందికొట్కూరు డివిజన్ నాయకులు మజీద్ మియ్య కోరారు. శుక్రవారం గోడ పత్రికలను స్థానిక ఇఫ్ట్ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఇఫ్టు నాయకులు మజీద్ మియ్య మాట్లాడుతూ నవంబర్ 1నుంచి 9 వరకు దేశ వ్యాప్తంగా అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ వారి వర్ధంతి సభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనీస్టు బొల్లవరం గ్రామంలో ఈనెల 6వ తేదీన జరగాబోయే సభను జయప్రదం చేయాలని కోరుతూ జాతీయ వాదం పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్, సంగ్ పరివార్ శక్తులు దేశంలో చేయని అరాచకాలు , సృష్టించని మారణ హోమాలకు అంతేలేదని అఖండ భారత దేశంలో ఏకైక జెండాగా కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి ప్రభుభక్తి నిరూపించుకోవడం కోసమే ఈ బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. వైసిపి అధికారంలో ఉన్న మన రాష్ట్ర పరిస్థితి అడుక్కునే దానికంటే ఎక్కువ అభివృద్ధికి తక్కువ అన్న విధంగా మారిపోయిందని ఎద్దేవాచేశారు. పిడిఎస్ యూ నందికొట్కూరు డివిజన్ కార్యదర్శిగా ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ ఆది నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా ఆదికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పనిచేసి నిరంతరం విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేయాలని పేర్కొన్నారు. ఈనెల 6న బో జరుగు అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆది , పిఓ డబ్ల్యు మహిళా సంఘం నాయకురాలు చూరిబీ, దేవమ్మ పాల్గొన్నారు.

About Author