అమరవీరుల సంస్మరణ సభలను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నక్సల్బరి,శ్రీకాకుళం,గోదావరిలోయ తదితర పోరాటాల్లో అమరులైన వీరులందరికీ విప్లవ జోహార్లు తెలియజేస్తూ సంబంధిత గోడపత్రికలను నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పి.మజీద్ మియా,రైతు కూలి సంఘం నాయకులు పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామ్రాజ్యవాద వ్యతిరేక హిందూ ఫాషిస్టు వ్యతిరేక పోరాటాలను తీవ్రపరుచుదాం బలమైన ప్రజా ప్రతిఘటన పోరాటాలను నిర్మిద్దాం అనే నినాదంతో భారత విప్లవద్యమంలో మమేకమైన ఎందరో విప్లవ వీరులు నవంబర్ మాసంలో అమరులయ్యారు. భారత విప్లవోద్యమ అగ్ర నేత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నవంబర్ 9వ తేదీన కనుముషాలు ఉపాధ్యాయ ఉద్యమ నేత కామ్రేడ్ నీలం రామచంద్రయ్య పిడిఎస్యు విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్.జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నవంబర్ 5వ తేదీన బూటకపు ఎన్కౌంటర్లో నేలకోరిగారు కామ్రేడ్. రంగవల్లి అక్కను పోలీసులు నవంబర్ 11వ తేదీన కాల్చి చంపారు అలాగే కర్నూలుకు చెందిన గాజుల వెంకటరాముడు అనేక విప్లవ వీరులు రాజ్య హింసకు బలి అయిపోయారు అలాగే ఈ మధ్యలో అమరులైన వారందరికీ విప్లవ జోహార్లు తెలియజేస్తూ నవంబర్ 6 వ తారీఖున కర్నూలు జిల్లా బొల్లవరం గ్రామం నందు, నవంబర్ 9న వేంపెంట గ్రామం నందు జరిగే అమరవీరుల సంస్మరణ సభలను సిపిఐ.ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు,కార్యకర్తలు,కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. మనదేశంలో అర్థవలస అర్థ భూస్వామ్య వ్యవస్థను అంతం చేసి దోపిడి పీడనలు లేని నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడానికి వేలాదిమంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ, మూషాహరి,బిర్గుం, గోపి వల్లభాపూర్ సిరిసిల్ల జగిత్యాల నుండి లాల్ గాడు నారాయణ పట్నం దండకారణ్యం వరకు నూతన వ్యవస్థ కొరకు బలిదానాలు కొనసాగుతున్నాయి వారి రక్తసిక్త త్యాగాలు నక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదు భారతదేశ రైతాంగ ప్రతిఘటనకు ప్రతీకలని అమరవీరులుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. వారు ఎన్నో త్యాగాలు చేసి ప్రజల కోసమే చివరి వరకు నిలబడి తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. వారు అమరపతాకాన్ని మరింత ఎరుపెక్కించారు. వారు నెలకొల్పిన విప్లవ సాంప్రదాయాలు విలువలు త్యాగాలు నిబద్ధత మనకు ఆదర్శప్రాయమని రక్తసిక్తమైన వారి మార్గంలో పయనించి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని పరిపూర్తి చేసి ఆ క్రమంలో సోషలిస్టు కమ్యూనిస్టు వ్యవస్థలు నెలకొల్పుటకు మనదేశంలో నూతన ప్రజాస్వామ్యకం సోషలిజం కమ్యూనిజం కోసం అంకితమై ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ విప్లవ జోహార్లు అర్పిద్దాం అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్మికులకు ప్రజాసంఘాల నాయకులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టియు జిల్లా కోశాధికారి పి.మౌలాలి, నాయకులు సామేలు, పిఓడబ్ల్యూ మహిళా నాయకురాలు చురుబి, లక్ష్మీదేవి.పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి. మర్రిస్వామి,డివిజన్ నాయకులు విక్రమ్. పార్టీ కార్యకర్తలు భాస్కర్ గౌడు, రామకృష్ణ, మహబూబ్ బాషా, ఉస్మాన్, రమణ, వెంకటరమణ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.