బేడ/బుడగ జంగాల బహిరంగ సభను జయప్రదం చేయండి
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: బుడగ/బేడ జంగం ఎస్సీ హోదా పునరుద్ధరణ బహిరంగ సభకు జాతి బిడ్డలందరూ వేలాదిగా తరలిరావాలని ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ,రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ పిలుపునిచ్చారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కోల్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈనెల 28వ తేదీ ఉదయం 10″గం” జరగబోయే ఎస్సీ ఉపకులాలలో ఒకటైన బుడగ/బేడ జంగాల సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు.ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, నాయకులు గుండాల ఈశ్వరయ్య, k.V రమణ, శుభాష్, ఆంధ్రయ్య, భాస్కర్ మాదిగలు మాట్లాడుతూ:- గౌరవ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే గతంలో భారీ ర్యాలీ ధర్నా కార్యక్రమం చేపట్టడం వల్లనే, ప్రభుత్వం స్పందించి బేడ బుడగ జంగం కులమునకు ఎస్సీ సర్టిఫికెట్స్ మంజూరు కావడం, భిక్షాటన, నిరక్షరాస్యత, అంటరానితనం, నుంచి విముక్తులు అవుతూ, కొంత మేరకు రిజర్వేషన్ పరంగా సంక్షేమ పథకాలు అందుకుంటూ, ఈ యొక్క కుల అభిమానాన్ని చాటుకోవడం జరిగినది, కానీ ఇప్పుడు ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ, ఈ జాతికి అందవలసిన న్యాయబద్ధమైన హక్కుల అందక అన్యాయం జరుగుతున్నది, కావున వీటిపై ఈనెల 28వ తారీఖున గౌరవ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బేడ బుడగ జంగం ఎస్సీ హోదా పునరుద్ధరణకె బహిరంగ సభ ఏర్పాటు చేయబడినదాన్ని కావున ఈ కార్యక్రమానికి వేలాదిమందిగా తరలివచ్చి మీ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బుడగ జంగం సీనియర్ నాయకులు సిరివాటి లక్ష్మయ్య, రుద్రాక్షల దస్తగిరి, సంకుల మహలింగప్ప, సిరిశాల జమ్మన్న, ధూపం శేఖర్, సిరిగిరి శ్రీకాంత్, సిరివాటి గిరిధర్, కోమారి జయరాముడు, బైల్ పార్టీ మద్దిలేటి, చింతలయ్య, సిరిగిరి జమ్మన్న, ధూపం చిన్న రాముడు మొదలగువారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కర్నూల్ టౌన్ జగదీష్ మాల్ దగ్గర టీచర్స్ అకాడమీ హాల్లో ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది.