వైఎస్ విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర !
1 min read
పల్లెవెలుగువెబ్ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ అంశాన్ని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. వైఎస్ విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడినట్టు తెలిసిందన్నారు. విజయమ్మతో మాట్లాడే ప్రయత్నం చేశానన్నారు. కేవలం 3500 కిలోమీటర్లు మాత్రమే కారు తిరిగిందని, ట్యూబ్ లెస్ టైర్స్ ఒకేసారి రెండు టైర్లు బద్దలయ్యాయని, ఇలాంటి ఘటన అసంభవమన్నారు. ఇది నమ్మశక్యంగా లేదని, దీనిపై సీఎం జగన్ తగు విచారణ జరిపించాలన్నారు. సీఎం దుష్ట చతుష్టయం అని అంటారు కాబట్టి విచారణ జరిపించాలన్నారు. ఏదో కుట్ర ఉందని, సీఎం కుటుంబంలో ఇలా జరగటం బాధాకరమన్నారు. గతంలో బాబాయ్‌ని కోల్పోయారని రఘురామ అన్నారు.