PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితులను వీరభద్ర గౌడ్ కు దూరం చేసే కుట్ర

1 min read

అసత్య ప్రచారాలను దళిత సోదరులు నమ్మొద్దు

ఆలింగనాలు, ఆత్మీయ కరచాలనాలతో  ప్రతి గ్రామంలో దళితులతో మమేకమవుతున్న వీరభద్ర గౌడ్

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్  కు రోజురోజుకు దళితులలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక  దళితులను వీరభద్ర గౌడ్ కు దూరం చేసే  కుట్రలు,కుతంత్రాలు  జరుగుతున్నాయని అందులో భాగంగానే  అవాస్తవమైన  వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని  హొళగుంద మండల దళిత నాయకుడు పంచకుండగ వెంకటేష్ మాదిగ విమర్శించారు. సోషల్ మీడియాలో వీరభద్ర గౌడ్ కు వ్యతిరేకంగా దళితున్ని తాకడానికి నిరాకరించాడని ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్న వీడియో పై  ఖండనను తెలియజేస్తూ  స్థానిక ఎస్ సి కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ    నియోజకవర్గంలో  గ్రామాలలో పర్యటిస్తున్న  వీరభద్ర గౌడ్ కు  దళిత కాలనీలలో నాయకులు ప్రజలు మహిళలు  బ్రహ్మరథం పడుతున్నారని  దీనితో దళితుల్లో వీరభద్ర గౌడ్ యొక్క  ఇమేజ్ ను  డామేజ్ చేయడం ద్వారా వీరభద్ర గౌడ్ కు దళితులను దూరం చేసే కుట్రకు  కొందరు ఉద్దేశపూర్వకంగా  తెర లేపారని, వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం  దళితులతో కుల రాజకీయం చేయాలని దళితులను పావులుగా వాడుకోవాలని  ప్రయత్నిస్తున్నారని ఇది అంత మంచిది కాదని  అన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో దళితులను కలుసుకుంటూ, పర్యటిస్తూ వారి చేత పూలమాలలు వేయించుకుంటూ, తిరిగి వారికి పూలమాలలు వేస్తూ కరచాలనాలు ఆలింగనాలు ఆదరాభిమానాలతో  ముందుకు సాగుతున్న వీరభద్ర గౌడ్ కు దళిత కాలనీలలో  ప్రజలు కూడా సంతోషంగానే సాదరంగా  స్వాగతం పలికి  ఆదరిస్తున్నారని, కుల వివక్ష ఉన్నట్లుగా తమకు ఎక్కడా కనిపించలేదని  ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే దళితులకు చేసే మేలు, అభివృద్ధి, అందించే సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి విషయాలపై  మాట్లాడాలని వీడియోలు చేయాలని  అంతేకానీ  దళితులను కించపరిచే విధంగా  ఇటువంటి తప్పుడు వీడియోలు సమాజంలో ప్రచారం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఈ విధమైన తప్పుడు వీడియోలతో  వీరభద్ర గౌడ్  కు జరిగిన నష్టం ఏమీ లేదని అయితే దళిత సమాజం  ఇంకా అంటరాని వ్యవస్థలోనే ఉన్నట్లుగా  చూపించడం వారి యొక్క ముఖ్య ఉద్దేశంగా  కనబడుతోందని  వీడియోలను మార్చిన వారు, మార్పించినవారు  మాలాంటి దళితులను మీ ఇళ్లలోకి  గుడుల్లోకి  తీసుకొని పోయే దమ్ముందా అని  సవాలు చేశారు . ఈ విధంగా దళితులను కించపరిచే విధంగా వీడియోలను  సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వాటిపై  చర్యల కోసం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని,  అదేవిధంగా దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని  కోరుతామని హెచ్చరించారు. కాబట్టి మా కులాలు గొప్ప అని ఆలోచించేవారు వాటిని మాత్రమే ప్రచారం చేసుకోవాలని దళితులను కించపరిచే విధంగా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా  వీడియోలను, అసత్య కథనాలను   ప్రచారం చేస్తే  అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని  తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దేవప్ప, ఐ టిడిపి హనుమంతు, సినిమా మంగన్న, ఉలగప్ప, బసప్ప, ముత్తయ్య, గాది లింగ, మాల మహానాడు నాయకులు  భజన చిదానంద, మల్లికార్జున, జనసేన నాయకులు వరాల వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author