NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించే కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అంబేద్కర్‌ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీలో రెండువర్గాల గొడవను కులఘర్షణగా మార్చారని దుయ్యబట్టారు. కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందన్నారు. సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్‌ విధానమన్నారు.

                                    

About Author