PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పథకం నిర్విర్యానికి కుట్ర

1 min read

– ఉపాధి హామీని ఐక్యంగా కాపాడుకుందాం

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఉపాధి కోసం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలనే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని దీనిని  ఐక్యంగా  తిప్పికొడదామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుబి వీర శేఖర్ పేర్కొన్నారు.అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త పిలుపుమేరకు బుధవారం దేవనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఆ సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మండల కార్యదర్శి మహబూబాషాలు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజురోజుకీ ఉపాధి హామీ నిధుల్లో  భారీ కోతలు విధిస్తున్నారని 1,20,000 కోట్లు ఉన్న ఉపాధి హామీ బడ్జెట్ను 69 వేల కోట్ల కు కుదించారని అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పని దినాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని,  వేతనాలకు ఆధారం అనుసందానం చేసే ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు. కరువు నేపథంలో 200 రోజులు పని దినాలు, 600 రూపాయల కనీస కనీస దినసరి  వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో  చాలా జాబ్ కార్డులు  తొలగించారని,  అర్హులైన వారందరికీ కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే పి రాముడు, లక్ష్మిరెడ్డి, సుధాకర్,రవి, ఏలియా, రాము, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author