PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా హ‌త్య‌కు కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగస్వాముల పేర్లను తాను ఓ వీడియోలో రికార్డు చేశానని, తనకు ఏదైనా జరిగితే ఈ వీడియోను బయటపెడతానని చెప్పారు. ఈ కుట్ర పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ జరుగుతోందన్నారు. ‘‘నన్ను హత్య చేయడానికి పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ ఉన్నవారు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ వీడియోను రికార్డు చేశాను. దానిని సురక్షిత ప్రదేశంలో భద్రపరిచాను. నన్ను హత్య చేస్తే, ఈ వీడియో బయటపడుతుంది’’ అని ఇమ్రాన్ చెప్పారు. అయితే ఆ కుట్రదారుల పేర్లను ఆయన వెల్లడించలేదు.

                                     

About Author