విదేశీ డబ్బుతో.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర !
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. విదేశీ శక్తుల డబ్బుతో.. ఇక్కడి రాజకీయ నాయకులనే వినియోగించి పాక్ విదేశాంగ విధానాన్నే మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద ఓ లేఖ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతోనే పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు డబ్బు బదీలీ చేస్తున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా.. తాను ప్రాణాలతో ఉన్నా లేకున్నా అలాంటి దేశదోహ్రులను విడిచిపెట్టాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.