NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేష‌న్ బియ్యం విదేశాల‌కు పంపే కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం ఉందన్నారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. గాజువాక, అనకాపల్లి, నర్సాపురం, కాకినాడ నంద్యాల పట్టణంలో సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలంటున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా లబ్దిదారులు బియ్యం కోరుకుంటున్నారన్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసిందన్నారు. ఇంటింటి రేషన్ పథకాన్ని అటకెక్కించేదుకే ఈ తంతు జరుగుతోందని ఆరోపించారు. పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే కుట్రలో భాగం ఇదని అన్నారు.

                                 

About Author