NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోssc.nic.inర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలు, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , మెడికల్ ఎగ్జామినేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుండి 69,100 మధ్య జీతం లభిస్తుంది.

About Author