PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏకగ్రీవంగా రాష్ట్ర వికలాంగుల నూతన కమిటీ ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని పిడబ్ల్యుడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండూరు వెంకటరామరాజు మాట్లాడుతూ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల వైకల్యం గల దివ్యాంగులందరిని ఒకే తాటిపై తీసుకువచ్చి రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా ఐక్యం చేసి దివ్యాంగులను చైతన్యవంతులు చేసి వారి అభివృద్ధి సంక్షేమం కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

  1. పిడబ్ల్యుడి ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద నెట్వర్కింగ్ వ్యవస్థగా తయారు చేయడం.
  2. దివ్యాంగుల చట్టం 2016లో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు అవగాహన కల్పించి మనం చట్టం ఇంప్లిమెంట్ అవడానికి కృషి చేయడం
    (పోలీసు వైద్య విద్య విభాగాలలో)
  3. దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధానంలో చర్యలు చేపట్టేటట్లు ముందడుగు వేయడం.
  4. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన దివ్యాంగులకు అందే విధంగా చర్యలు చేపట్టడం.
  5. దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అనగా ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, చేతి కర్రలు, చెవిటి మిషన్లో ,బ్లైండ్స్టిక్స్ , అవసరమైన వారికి ప్రభుత్వ లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా అందించడం.
  6. ప్రస్తుతం చదువుతున్న దివ్యాంగులు విద్యార్థులకు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి చదువు నిమిత్తం అవసరమైన సహాయ సహకారాలు అందించడం.
  7. నిరుద్యోగ దివ్యాంగులు ఉపాధి ఉద్యోగ స్వయం ఉపాధి కల్పన విషయం దివ్యాంగుల ఆర్థిక పరిస్థితి కోసం మంచి ప్రగతి సాధించడానికి కృషి చేయడం.
  8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ దివ్యాంగులు చట్టం 2016 కేంద్రం మరియు రాష్ట్ర పథకాలు గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటికి అందించే విధంగా మరియు వారి సమస్యలు పరిష్కరించేందుకు దివ్యాంగులు నాయకులు చేయడం.
  9. గ్రామాలలో వార్డు స్థాయి సీట్లు నుండి ఢిల్లీలో కూర్చుని పార్లమెంట్ సీట్ వరకు దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అన్ని పార్టీ నాయకులు కేటాయించే విధంగా ఒప్పించి దివ్యాంగుల రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేయడం.
  10. దివ్యాంగుల ఆత్మగౌరవంకు ఏ విధమైన భంగం కలగకుండా ఎల్లప్పుడు కృషి చేయడం
    అనంతరం పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందిరాష్ట్రస్థాయి గౌరవ అధ్యక్షులు ఎన్ జేసుదాసు విజయనగరం అధికార ప్రతినిధిగా సుబ్రహ్మణ్యం తిరుపతి అధ్యక్షులుగా కానూరు శంకర్రావు విజయనగరం ఉపాధ్యక్షులుగా ఏ మురళి చిత్తూరు ప్రధాన కార్యదర్శిగా కొనతం చంద్రశేఖర్ చిత్తూరు సహాయ కార్యదర్శిగా ఎన్వి రామరాజు, అన్నమయ్య జిల్లా జి కొండలరావు కాకినాడ కోశాధికారిగా వైవి కృష్ణారావు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా స్థాయి కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా మండిపల్లి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు కార్యదర్శిగా గోనపల్లి చంద్రశేఖర్ సహాయ కార్యదర్శిగా కొండూరు రఘు, ట్రెజరర్ గా తెల్ల గోల కాత్యాయని కమిటీ సభ్యులుగా కత్తి నాగన్న వెంకటసుబ్బయ్య ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

About Author