నేటి ప్రజల స్వేచ్ఛకు రాజ్యాంగమే మూలం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజల స్వేచ్చా స్వాతంత్రలకు మూలం… రాజ్యాంగంమే/రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ప్రజలు స్వేచ్ఛగా వుండగలుగు తున్నారు..సురేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక. ఆంధ్రప్రదేశ్… భారత రాజ్యాంగం ఎంతో విశిష్ట తో కూడు కున్నదని, దేశం లో బిన్న మతాలు, సంస్కృతులు, ఆచారాలు ఉన్నా. సమైఖైంగా, స్వేచ్ఛగా, వుండ గలుగుతున్నారు అంటే మన విశిష్ట రాజ్యాంగం వల్లనే అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు సురేష్ కుమార్ అన్నారు… ఆదివారం స్థానిక బిర్లా కాంపౌండ్ లోని జెవివి జిల్లా కార్యాలయం యందు రాజ్యాంగ దినోత్సవం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనమాట్లాడుతూ నేటి ప్రజలు స్వేచ్ఛకు రాజ్యాంగమే మూలం అని,1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ను అధికారికంగా ఆమోదించుకొన్న రోజు అని, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మంచి విషయం అని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవడం బాధ్యత గా తీసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమం వచ్చిన సభ్యులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సమావేశానికి చెన్నయ్ చెందిన ఖగోళ శాస్త్ర వేత్త కృష్ణ స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు శేషాద్రి రెడ్డి ,భాష,మద్దిలేటి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దామోదర్, ప్రతాప్ రెడ్డి శ్రీరాములు, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.