భారత రాజ్యాంగం.. ప్రపంచానికే ఆదర్శనీయం..
1 min readశ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ డా.బి. హరికిషన్
పల్లెవెలుగు వెబ్: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ డా.బి. హరికిషన్. గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కర్నూలు నగరంలోని శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల ఆవరణలో డైరెక్టర్ డాక్టర్ బి. హరికిషన్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. హరికిషన్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని, ప్రతి పౌరుడు తన బాధ్యతను విస్మరించరాదన్నారు. దేశ స్వాతంత్య్ర సమరయోధలను స్మరించుకుంటూ… వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా డా.బి . హరికిషన్ కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.