ఎమ్మిగనూరు నుండి కమ్మలదిన్నె వరకు రోడ్డు వేయండి
1 min read
గుంతల రోడ్డుతో ప్రయాణికులు నిత్యం నరకయాతన
ఆర్ ఏ వి ఎఫ్
ఎమ్మిగనూరు , న్యూస్ నేడు: కర్నూల్లో రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్ ఏ వి ఎఫ్ )ఆధ్వర్యంలో రోడ్లు భవనాల ఉప పర్యవేక్షక ఇంజనీర్( R&B Dy S. E) వై. సిద్ధరెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థు సంఘం జిల్లా కార్యదర్శి ఖాజా మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి కమ్మల దీన్నే వరకు మాలపల్లి మీదగా కోసిగి వెళ్లే రోడ్డు అద్వానంగా తయారయ్యిందని ఈ రోడ్డు పరిధిలో ఎమ్మిగనూరు మరియు మంత్రాలయం నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయని నిత్యం ఎమ్మిగనూరుకు చదువుకొనుటకు వెళ్లే విద్యార్థులు అలాగే నిత్యం కూలీ పనులకు వెళ్లే మహిళలు వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి ఎమ్మిగనూరుకు వచ్చే రైతులు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గుంతల రోడ్డుతో మధ్యలోనే ప్రసవించిన దుస్థితి నెలకొని ఉన్న పట్టించుకునే నాధుడే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోడ్డు వేసి 20 సంవత్సరాలు పైన అయ్యిందని అడుగుకో గుంతగా వర్షాకాలం అయితే రోడ్డు చెరువును తలపించే విధంగా తయారయ్యిందని అన్నారు మరియు ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామికి వెళ్లే భక్తులు నిత్యం నరకయాతన చూస్తున్నారని వారు వివరించారు ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి ఈ రోడ్డు వెయ్యాలని వారు కోరారు.డిప్యూటీ ఎస్.ఈ వివరణ : గతంలో ఇది డబల్ రోడ్డు మంజూరు అయిందని అయితే ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసి ఇప్పుడు సింగల్ రోడ్డు గా మంజూరు చేసే అవకాశం ఉందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని వారు వివరించారు.