PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుమతి లేకుండా అపార్ట్మెంట్ల నిర్మాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామంలో బస్టాండ్ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్క రహదారిలో సర్వేనెంబర్ 134-15 , 16 లో ఎం .ఎస్ .వి కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన అపార్ట్మెంటుకు, సంబంధించిన ఏ.పీ. సి. ఆర్ డి. ఏ విజయవాడ వారి అనుమతి లేనందున ఆ అపార్ట్మెంట్ లోని ప్లాట్లను క్రయ విక్రయాలు జరుగుతున్నందున ఏ.పీ .సి .ఆర్. డి. ఏ యాక్ట్ 11 ఆఫ్ 2014 సెక్షన్ 114 (1)(డి) ప్రకారం ఏ.పీ .సి. ఆర్. డి. ఏ కమిషనర్ వివేక్ యాదవ్ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోగలరని,కృష్ణా జిల్లా కలెక్టర్ కి స్పందనలో విన్నవించడం జరిగిందని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author