77 లక్షల రూపాయలతో బీటీ రోడ్ లు నిర్మాణం
1 min read
శంకుస్థాపన చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు కార్పొరేషన్ లో కలిసిన పంచాయితీల్లో 60 శాతం పైగా రోడ్లు నిర్మించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధులు 77 లక్షల రూపాయలతో నిర్మించనున్న రెండు రోడ్లకు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల్లో తాను ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ ప్రయారిటీలో వంగాయగూడెం క్యాన్సర్ హాస్పటల్ ఎదురుగా ఉన్న పోలీస్ కాలనీ రోడ్డుకు 15వ ఆర్థిక సంఘం నిధులు 42 లక్షల రూపాయలు కేటాయించి బీటీ రోడ్డు నిర్మిస్తున్నా మన్నారు. అదేవిధంగా 20వ డివిజన్ మినీ బైపాస్ రోడ్డులో గ్రీన్ సిటీకి ఎదురుగా సత్రంపాడు మెయిన్ రోడ్డును కలుపుతూ ఉన్న రోడ్డు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుగా నిర్మించడానికి ఆదివారం శంకుస్థాపన చేశామన్నారు. ప్రజలుఎటువంటి సమస్యలతో తన వద్దకు వచ్చిన వారి ఇబ్బందులు తెలుసుకొని అవి తీర్చుతున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేయర్ కమిషనర్ కార్పొరేటర్లు అందరూ కలిసి రోడ్లు వేస్తున్నామని అయితే ప్రజలు ఎక్కువ భాగస్వామ్యం తీసుకొని నిర్మించిన రోడ్లపై గోతులు తవ్వడం,రోడ్లపై చెత్త,ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయడం వంటివి మానుకోవాలన్నారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి చంటి నగరంలో పర్యటించినప్పుడు ప్రజల అభ్యర్థన మేరకు శాసనసభ్యులు వారి ఆదేశాలతో వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతంలో మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుండి సిసి,బీటీ రోడ్లను నిర్మించామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 9 నెలల కాలంలో మున్సిపల్ జనరల్ ఫండ్స్,15 వ ఆర్థిక సంఘం నిధులు మొత్తంగా 15 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్లు,డ్రైనేజీలు,కల్వర్టులు నిర్మిస్తున్నామన్నారు. వీటిలో కొన్ని పనులు పూర్తి చేయగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని మరో మూడు నెలల్లో పనులన్నీ పూర్తిచేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, డీఈలు రజాక్,కొండలరావు ఏఈ లు సాయి,సంధ్య,కార్పొరేటర్లు గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్, దారపు అనూష తేజ,ఎర్రంశెట్టి నాగబాబు,తెలుగుదేశం నాయకులు కప్ప ఉమామహేశ్వరరావు,తెర్లి వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రసాద్, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,నున్నా ఆంజనేయులు,కస్తూరి తేజశ్రీ,మీసాల సతీష్, డొక్కు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
