ఐఎంఏ భవనం నిర్మించడం..అభినందనీయం..:టీజీ భరత్
1 min readపల్లెవెలుగు: మంచి కార్యక్రమాలకు టీజీవి సంస్థల సహకారం ఎప్పటికీ ఉంటుందని టీజీవి సంస్థల చైర్మన్ టిజి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవంలో టీజీ భరత్ పాల్గొన్నారు. టిజీవి సంస్థల తరఫున ఈ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ఇదివరకే విరాళంగా అందించారు. ఏఐజి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిజి భరత్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ వైద్యులు కనిపించే దేవుళ్ళు అన్నారు. కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరు ఉందని.. అలాంటిది ఇంతవరకు కర్నూల్లో ఐఎంఏ కు భవనం లేకపోవడం దురదృష్టం అన్నారు. ఇప్పటికైనా నూతన భవనం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐఎంఏ భవన నిర్మాణంలో టీజీవి గ్రూప్ సహకారం ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు నాగేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవడం గొప్ప విషయమన్నారు. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను ఏఐజి హాస్పిటల్ బ్రతికించిందన్నారు. ఐఎంఏ భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భరత్ అన్నారు. ఇక వైద్యులు కూడా వైద్యశాస్త్రంలో రీసెర్చ్‌లు చేసేందుకు నెలకు ఒక్కరోజైనా కేటాయించాలని టిజి భరత్ సూచించారు. ఇక ప్రజల కోసం మంచి పనులు చేసేందుకు తమ టీజీ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని ఆయన చెప్పారు. అందరి ఆశీస్సులు ఉంటే సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.