9వ వార్డు ఎస్సీ కాలనీలో తాగునీటి అవసరాలకు నూతన బోరు ఏర్పాటు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/6-10.jpg?fit=550%2C248&ssl=1)
40 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు,
రోడ్డు మంజూరు అయిందని తెలుసుకొని కొందరు అనవసరంగా ధర్నాలు చేస్తున్నారు,
9వ వార్డు టీడీపి ఇంచార్జి కటారి రాజేంద్ర
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో అభివృద్ధి అంటే ఎమ్మిగనూరులో గుర్తు వచ్చేది బీవీ కుటుంబం అని, ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి చొరవతో 9వ వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి 9వ వార్డు టీడీపి ఇంచార్జి కటారి రాజేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ తమ వార్డులో నీటి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా తాగునీటి అవసరాల కోసం వెంటనే బోరు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ కనెక్షన్ ద్వారా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే తమ వార్డులో పెద్ద కామేలా నుంచి ఆర్సీఎం చర్చి వరకు రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయిందని తెలిపారు. వార్డుల్లో అభివృద్ధి జరగాలంటే ఒక బీవీ కుటుంబానికే సాధ్యం అవుతుంది.గత ఐదేళ్ల నుండి జరగని అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. కొందరైతే ఎక్కడెక్కడ రోడ్డు నిర్మాణం పనులు మంజూరు అయ్యాయో తెలుసుకొని, అక్కడకు వెళ్లి ధర్నా చేసి తాము ధర్నా చేసినందుకు రోడ్డు వేశారని గొప్పలు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు. గత ఐదేళ్లు ఎమ్మిగనూరు పట్టణంలో జరగని అభివృద్ధి గురించి మాట్లాడలేదుగానీ, కూటమి ప్రభుత్వంలో 5 ఏళ్ల తర్వాత జరుగుతున్న అభివృద్ధి గురించి విమర్శలు చేయడం సరికాదు. అభివృద్ధి అంటే బీవీ..బీవీ అంటే అభివృద్ధికి ఒక బ్రాండ్ గా నిలుస్తున్నారు. ప్రతి వార్డును సుందరంగా తయారు చేయడమే బీవీ కుటుంబం లక్ష్యం.ఈ కార్యక్రమంలోమున్సిపల్ సిబ్బంది,వార్డు కార్యకర్తలుఇబ్రహీం,రఘు. అనిల్ కుమార్, బడే సాబ్, కళ్యాణ్,జాన్.మూర్తి.వార్డు ప్రజలు. పాల్గొన్నారు.