రోగి సౌకర్యార్థం విశ్రాంతి గదులను నిర్మింపచేయడం అభినందనీయం
1 min read– ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి ఏరియా ఆసుపత్రిలో రోగి సహాయకుల సౌకర్యార్థం విశ్రాంతి గదులను నిర్మింపచేయడం అభినందనీమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయచోటి ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో రూ 36 లక్షల సొంత డబ్బుల వ్యయంతో రోగి సహాయకుల వసతి గదులును రెండింటిని వీరబల్లె మండలం గడికోట కు చెందిన వి మల్లికార్జున రెడ్డి మరియు వారి కుమారుడు భార్గవ్ రెడ్డి లు నిర్మించారు.ఆ గదులను సోమవారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారబించారు.ఈ సందర్భంగా గదుల నిర్మాణ దాత మల్లికార్జున రెడ్డిని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, ఆసుపత్రి వైద్యాధికారులు ,పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి దుస్సాలువలుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా చంద్రశేఖర్, డా మహేశ్వర రాజు, డా రెడ్డి భాస్కర్ రెడ్డి, డా లక్ష్మీ ప్రసాద్,దుద్యాల బసిరెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి, కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, ఫయాజ్ అహమ్మద్, ఎస్ పి ఎస్ రిజ్వాన్, షబ్బీర్, రత్నశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా సభ్యుడు దిన్నెపాడు రవిరాజు, పల్లా రమేష్,గువ్వల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.