విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి వర్చువల్ గా సీఎం శంకుస్థాపన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి పలు జిల్లాలలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాలకు వర్చువల్ గా ప్రారంభించారు, ఇందులో భాగంగా గడివేముల మండలం కొర్రపోలుర్ గ్రామ సమీపంలోని దాదాపు 98 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో 16 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ, గృహలకు, పారిశ్రామిక అవసరాల కొరకు 220/132/33 కె వి కె.వి విద్యుత్ కేంద్రం, విద్యుత్ లైన్ ఏర్పాటుకు వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తూన్న ప్రత్యక్ష ప్రసారాన్ని గడివేముల 33 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం నాడు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సామున్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మైనార్టీ శాఖ ప్రభుత్వ సలహాదారులు డిఎస్ హబీబుల్లా, ఆర్డీవో శ్రీనివాసులు, తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప, మండల అధ్యక్షురాలు నాగమద్దమ్మ, ఎస్ ఈ ఉమాపతి, ట్రాన్స్కో ఈ ఈ మధుసూదన్, సివిల్ ఈ ఈ శ్రీనివాసరావు, డిప్యూటీ ఈ ఈ కృష్ణ, ఏ డి ఈ సతీష్, ఏఈలు శరత్,మదన్, ఏఈ ఖలీల్ పాషా, మండల కన్వీనర్ శివరాం రెడ్డి, నంద్యాల జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శిరూప శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మాలిక్ బాషా, వైసిపి నాయకులు, శివానందరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, పుల్లయ్య, వెంకట కృష్ణారెడ్డి, రఘు మాధవరెడ్డి, కాలు నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.