PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొర్నిపాడు జెడ్పీ హైస్కూల్​ గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : డా. కె. వేణుగోపాల్​

1 min read

పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా  దొర్నిపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె .వేణుగోపాల్  ఆకస్మిక తనిఖీ చేశారు. మనబడి నాడు నేడు క్రింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒక కోటి 71 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది .  కానీ  ఇప్పటివరకు 80 లక్షల రూపాయలకు మాత్రమే పనులు పూర్తి కావడం వల్ల సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ కె. వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రీన్ చాక్ బోర్డులు అదనంగా ఉన్నాయని, వాటిని వెనువెంటనే దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కావలసిన గ్రీన్ బోర్డులను తెప్పించ వలసినదిగా అసిస్టెంట్ ఇంజనీర్ గుప్తను ఆదేశించారు. పాఠశాలలో మిగిలిన 8  అదనపు తరగతి గదులను మరియు మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన 18 లక్షల రూపాయలు సి .ఎఫ్ .ఎం. ఎస్ లో పెండింగ్​లో ఉన్నాయని వాటి విడుదలకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  అనంతరం పాఠశాలలోని  విద్యార్థులతో పాటుగా మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలోని 15–18 వ సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులందరికీ నూరు శాతం కరోనా వ్యాక్సిన్ నేషన్ పూర్తి చేయించిన ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. తర్వాత కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలకు కేవలం 6 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు .ప్రిన్సిపాల్ ను మరియు బోధనా సిబ్బందికి, విద్యార్థినీల తల్లిదండ్రులకు ఫోన్ చేసి , విద్యార్థులందరూ  పాఠశాలకు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భవిత సెంటర్ ను కూడా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు . మండలంలోని  మండల విద్యా వనరుల కేంద్రంలో సి. ఆర్. పి లకు, ఎం.ఐ.ఎస్ లకు, డి. టి. పి లకు, ఎ డబ్ల్యూ పి మరియు బడ్జెట్టు 2022–23 సంబంధించిన పాఠశాల కాంప్లెక్స్, హ్యాబిటేషన్, మండల ప్రణాళికలను సకాలంలో పూర్తి చేసి  జిల్లా కార్యాలయానికి అందచేయాలని సంబంధిత సిబ్బందిని  ఆదేశించారు. ఈ పర్యటనలో ఎం ఐ ఎస్ మరియు ప్లానింగ్ కోఆర్డినేటర్ సుభానందరావు,అసిస్టెంట్ జి సి డి ఒ సునీత లు ఉన్నారు.

About Author