హైకోర్టులో కేసు పరిష్కారం అయ్యేంతవరకు నిర్మాణాలు చేపట్టరాదు
1 min readరాష్ట్ర వికలాంగుల సంఘం ముఖ్య ట్రెజరర్ ముప్పాల వెంకటరామరాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : అన్నమయ్య జిల్లా పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పొలంలోని సర్వేనెంబర్ 625 కి సంబంధించి వికలాంగుల సంఘం రాష్ట్ర ట్రెజరర్ ముప్పాల వెంకటరామరాజుహైకోర్టులో కేసు వేసి నందున హైకోర్టులో కేసు పరిష్కారం అయ్యేంతవరకు తమ భూములలో ఎలాంటి క్రయ విక్రయాలు నిర్మాణాలుచేపట్ట రాదని ఒక పత్రిక ప్రకటనలో ముప్పాళ్ళ వెంకటరామరాజు తెలిపారు.మంగళవారం తమ పొలంలో ఇతరులు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నందున వికలాంగుల సంఘం నాయకులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అన్నదమ్ములకు సంబంధించిన పట్టా భూములలో ఇతరులు అక్రమంగా ఆన్లైన్ చేసుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తూ తమ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నించడం దారుణం అన్నారు.ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు స్థానిక పోలీస్ అధికారులకుఅర్జీలు ద్వారా తెలిపినట్లు ఆయన తెలిపారు.ఈ విషయమై హైకోర్టులో కేసు దాఖలు చేయగా కోర్టుతమకు ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించిన పత్రాలు రెవిన్యూ అధికారులకు పోలీసు అధికారులకు సమర్పించామన్నారు కావున ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులు తమ భూములలో ఎలాంటి క్రేయ విక్రయాలు నిర్మాణాలు చేపట్ట రాదని తెలిపారు. అలా చేపట్టినట్లయితే కొనుగోలుధారులు,గ్రామస్థులు, నష్టపోతారన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిరుద్యోగ వికలాంగుల సంఘం అధ్యక్షులు కమతం చంద్రశేఖర్, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.