PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినియోగదారుల హక్కులు చట్టాల పై ప్రజల్లో అవగాహన పెరగాలి

1 min read

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సభలో జిల్లా కలెక్టర్ బి. లావణ్య వేణి వెల్లడి…

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  వినియోగదారుల హక్కులను రక్షించేందుకు నిర్దేశించిన బలమైన, స్పష్టమైన  చట్టాలపై ప్రజలకు అవగాహన కలిపించే భాధ్యత నేటి యువతరంపై ఉందని జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లైయి అధికారి ఆర్.ఎస్.ఎస్. రాజు శుక్రవారం స్ధానిక సి ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో జెసి  లావణ్య వేణి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే మోసాలు చిన్నవైన, పెద్దవైన సరైన న్యాయాన్ని పొందటానికి అవకాశం దక్కుతుంద న్నారు. సమాజంలో ప్రతి వినియోగదారుడు తమ హక్కుల తో పాటు భాద్యతలు తెలుసుకోవాలన్నారు.  వినియోగదారుల రక్షణ చట్టం పటిష్టంగా  అమలు కావడంపై అవగాహన కల్పిస్తామన్నారు. వినియోగదారులకు రక్షణ కోసం కల్పించబడిన ప్రయోజనాలను వారు నష్టపోకుండా వినియోగదారు ల సంక్షేమ ఉద్యమకారులు ప్రజలను చైతన్య పరచవలసిన భాధ్యత వుందన్నారు. వినియోగదారులు తమ హక్కులను పొందేందుకు అవసరమైన యంత్రాంగం వుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 2019 కొత్త వినియోగదారుల హక్కుల చట్టం వచ్చిందని దీనిలో ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికపరమైన విజ్ఞానాన్ని పొందిపరిచారన్నారు.   వినియోగదారుడు  ఏ వస్తువు కొన్నా, ఏ సేవ పొందినా అది వినియోగదారునికి ఉపయోగ పడాలే కానీ హాని కలిగించరాదని , వాటి వలన  పూర్తి భద్రత ఉండాలని పేర్కొన్నారు. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు అనే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు.  ఈ-కామర్స్ , ఆన్లైన్ అమ్మకాలు, కొనుగోళ్ళ లో జరుగుతున్న మోసాలు అరికట్టబడతాయన్నారు. విద్యా సంస్థల్లో కూడా కన్స్యూమర్ క్లబ్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా  ఈ చట్టం  పని తీరు , చట్టం లోని అంశాల పై అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు.  విద్యతోపాటు విద్యార్ధులు స్కిల్ నైపుణ్యాన్ని కలిగియుండాలని తెలిపారు. కార్యక్రమం లో పాల్గొన్న  వినియోగదారుల ఫోరంనకు చెందిన కన్జ్యూమర్ జిల్లా ప్రెసిడెంట్ మరియు న్యాయవాదియైన  కట్టా సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ న్యాయవాది రామానుజాచార్యులు, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ సభ్యురాలు న్యాయవాది నాగలక్ష్మి, డాక్టర్ విజయ్ కృష్ణ, తదితరులు మాట్లాడుతూ వినియోగదారులకు కొనుగోలులో నష్టం వాటిల్లితే సంబంధించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన పలు అంశాలను పైన ఇన్సూరెన్స్ భద్రతా హక్కు బిల్లు తీసుకోవడం ధర, నాణ్యత పరిణామం పై ప్రశ్నించే హక్కు కలిగి ఉండడం ఉత్పత్తి చేసే వారే జవాబుదారుడవుతాడని తదితర అంశాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు.   కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణిని వినియోగదారుల ఫోరం సభ్యులు సన్మానించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ చేతులమీదుగా కన్జ్యూమర్ జిల్లా ప్రెసిడెంట్ మరియు న్యాయవాదియైన  కట్టా సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ న్యాయవాది రామానుజాచార్యులు, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ సభ్యురాలు న్యాయవాది నాగలక్ష్మి, డాక్టర్ విజయ్ కృష్ణ వారిని సన్మానించడం జరిగింది.  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వినియోగదారులు, పలువురు ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

About Author