కలుషితమవుతున్న జలం.. లీకేజీలతో కలుస్తున్న మురుగునీరు..
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిన పంచాయతీ సిబ్బంది తీరు విధులు మరిచి క్షేత్రస్థాయి పర్యటనలలో బిజీగా ఉన్న కానరాని ప్రజా సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అంటూ మండలంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు బిలకల గూడూరు గ్రామంలో సమస్యలు తిష్ట వేసిన రెగ్యులర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి అటువైపు చూడకపోవడంతో. గ్రామంలో పైప్ లైన్ లో లీకేజ్ నీరు కారణంగా మురుగునీరు కలుస్తుందని కలుషిత నీళ్లు తాగి ప్రజలు అతిసారం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాన రహదారి వెంట లీకేజీలతో ముస్లిం కాలనీలో మురుగునీరు సమాంతరంగా మంచినీటి పైప్లైన్ ఉండడంతో నీరు కలుషితమవుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను తీర్చాలని రాబోయే వర్షాకాలంలో తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉందని లీకేజీల మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.