NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో కొన‌సాగుతున్న సూచీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో నెల‌కొన్న పాజిటివ్ కార‌ణంగా సూచీలు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఒమిక్రాన్ భ‌యాలు నెల‌కొన్న‌ప్ప‌టికీ .. త్రైమాసిక ఫ‌లితాలు, బ‌డ్జెట్ వంటి అంశాలు మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. దీంతో ఉద‌యం నుంచే పాజిటివ్ జోన్ లో సూచీలు ట్రేడింగ్ ప్రారంభించాయి. 18000 పైన నిఫ్టీ క్లోజ్ అయితే.. మ‌రికొంత అప్ సైడ్ మూవ్ మెంట్ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఉద‌యం 11: 20 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 418 పాయింట్ల లాభంతో 60,164 వ‌ద్ద‌, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 17,946 వ‌ద్ద‌, బ్యాంక్ నిఫ్టీ 363 పాయింట్ల లాభంతో 38,104 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి.

                                        

About Author